అయ్యప్ప భక్తులచే నిర్వహించబడే ధార్మిక నియమనిష్ఠలు

శబరిమల దేవుడు ధర్మ షష్ఠ. అయ్యప్ప స్వామి ధర్మ షష్ఠలో ఐక్యమయ్యాడని పురాణ గాథ. తన భక్తుల కష్టాలను కడతేర్చే దేవుడిగా అయ్యప్ప స్వామిని పరిగణిస్తుంటారు. శబరిమల యాత్రను 41 రోజులపాటు దీక్ష పాటించిన అనంతరమే చేపడతారు. తొలిసారి యాత్ర చేపట్టేవారు, చాలాసార్లు యాత్ర చేసిన భక్తులు కూడా దీక్షను పాటించాల్సి ఉంటుంది. విధి నిర్వహణకోసం ఆలయంలో నియమితులైన అధికారులు, నెలవారీ పూజలకోసం మందిరాన్ని తెరిచినప్పుడు స్వామిని సందర్శించే భక్తులు సైతం దీక్ష చేపట్టాల్సిందేనని ఇటీవల ఆలయంలో కనుగొన్న జ్యోతిష్య సంబంధ గ్రంథాలు చెప్పాయి. మలయాళ మాసం వృశ్చికం తొలిరోజున అంటే సూర్య భగవానుడు సద్గతి మార్గాన పయనాన్ని ప్రారంభించిన సమయంలో శబరియాత్రకు దీక్ష మొదలవుతుంది...

© Copyright 2015 Manoramaonline. All rights reserved.