పవిత్ర కంఠహారాన్ని ధరించి మంత్రం చెప్పబడుతుంది

కఠోరమైన నియమాలు, చిత్తశుద్ధి, గురుభక్తి, ఆత్మ నివేదన అయ్యప్ప దీక్షలోని ముఖ్యమైన విషయాలు. 41 రోజులపాటు మండల దీక్ష కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకోవటం ఈ దీక్ష ముగుస్తుంది. అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ మనస్సునూ, శరీరాన్ని భగవంతుడికి అంకితం చేయాలి. ప్రతి ఒక్కరినీ భగవత్ రూపాలుగా తలచి అయ్యప్ప నామ జపంతో నిత్యం భజనల్లో పాల్గొనాల్సి ఉంటుంది.మలయాళ మాసమైన వృశ్చికం మొదటి రోజున శబరిమల యాత్ర ప్రారంభం అవుతుంది. సూర్య భగవానుడు మోక్ష మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వృశ్చికం నెల ప్రారంభం అవుతుంది. ఇంతకంటే ముందుగా యాత్ర చేయాలనుకునేవారు మాత్రం ముందుగానే దీక్ష చేపట్టాల్సి ఉంటుంది.తొలిసారి దీక్ష తీసుకున్న స్వాములు 51 రోజులుపాటు మాలను ధరించాల్సి ఉంటుంది. 41 రోజులపాటు సీనియర్ భక్తుల పర్యవేక్షణలో దీక్షను కొనసాగించాలి. దీక్ష తీసుకున్న ప్రతి ఒక్క పురుష స్వామికి అయ్యప్ప దర్శనం లభిస్తుంది. అయితే పది సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలకు, 50 సంవత్సరాల లోపు మహిళలకి స్వామి దర్శనానికి అనుమతి లభించదు.
అయ్యప్పస్వామి ప్రతిమను కలిగిన పవిత్ర కంఠహారాన్ని ధరించాలి.

ఎవరైనా అయ్యప్పస్వామి ప్రతిమను కలిగిన పవిత్ర కంఠహారాన్ని ధరించి ఉన్నట్లయితే వాళ్లు అయ్యప్ప దీక్షలో ఉన్నట్లు చూడగానే ఎవరైనా గుర్తిస్తారు. ఈ మాల లేదా గొలుసు ముందుగా పవిత్రమైన ఆలయంలో పరిశుద్ధం చేయబడినదై ఉండాలి. లేదా ఈ పవిత్ర కంఠహారాన్ని సీనియర్ యాత్రికుడు (గురుస్వామి) ముందుగా ధరించి ఉండాలి. శనివారాలు మరియు అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం అయిన ఉత్తరం నందు పవిత్ర కంఠహారాన్ని ధరించేందుకు మంచి రోజులు.
సాధారణంగా ఈ పవిత్ర కంఠహారాన్ని ధరించి బసిల్ (తులసి) లేదా రుద్రాక్షలతో తయారు చేస్తారు. వీటినే తులసి మాల లేదా రుద్రాక్ష మాల అంటారు. రోజుకి ఒకటి రెండుసార్లు స్నానం చేసి కఠినమైన బ్రహ్మచర్యం పాటించేవారు ఈ మాలలను ధరించవచ్చు.

పూజా విధానములో జపమాలగా ఉత్కృష్ఠమైన స్థానాన్ని పొందే కంఠాభరణాలు రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు మరియు తామర పూసల మాలలు శ్రేష్ఠమైనవిగా భావించబడుతున్నాయి. ఈ మాలధారణ మానవులు శారీరకంగా మరియు మానసికంగా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే వీటిని పవిత్రమైనవిగా భావించి, ఈ మాలలకు అభిషేకము చేయించి, మంత్రోచ్చారణ ద్వారా అందు అయ్యప్పస్వామిని ఆవహింప చేసి వాటిని ధరించి భక్తులంతా త్రికరణశుద్ధిగా స్వామిని సేవించుకుందురు
పవిత్రమైన తులసీమాల లేదా రుద్రాక్షమాలను ధరించి కింది మంత్రం జపించాల్సి ఉంటుంది.
జ్ఞాన ముద్రం సహస్త్ర ముద్రం, గురు ముద్రం నమామ్యహం
వాన ముద్రం శుద్ధ ముద్రం రుద్ర ముద్రం నమామ్యహం
శాంత ముద్రం సత్య ముద్రం వ్రత ముద్రం నమామ్యహం
సబర్యాశ్రమ సత్యేన ముద్రం పాతు సదాపిమేం
గరుడక్రిష్ణ పూర్వం తస్యానుగ్రహ కారణే
సబర్య చాల ముద్రాయాయై నమస్తుబ్యం నమో నమహ!
అర్థం
జ్ఞానం, పవిత్ర గ్రంథం, ఉపదేశకుడు, అరణ్యం, నిర్మలత్వ చిహ్నానికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. శాంతి, సత్యం, దీజ్ఞా చిహ్నానికి నా ప్రణామాలు. శబరి ఆశ్రమ సత్యం ఈ ముద్రను నిత్యం సంరక్షించు గాక.
నా ఉపదేశకుడి దయ, ఆశీర్వాదాలను అందుకున్న తర్వాత, ఓ దేవా, నీమీదే భారముంచుతూ నా ఈ సంపూర్ణ విధేయతల ముద్రను నేను అవధరిస్తాను. శుద్ధ జ్ఞానం, అలౌకికం, మంగళకరమైన ఈ ముద్రకు నా ప్రణామాలు. శబరిమల చిహ్నమా, నీకు మరల మరల నా ప్రణామాలు అర్పిస్తాను.

ఒకవేళ దీక్ష భగ్నమైతే
41 రోజుల దీక్ష తీసుకోకుండా ఎవరూ అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించకూడదు. అయినప్పటికీ, అనివార్య కారణాల వల్ల దీక్ష భగ్నమైన పక్షంలో, ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారో వాళ్లు మళ్లీ దీక్షను తీసుకుని 41 రోజులపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించాలి. ఏవైనా సమస్యల కారణంగా భక్తులు తమ దీక్షను కలుషితం చేసినట్లయితే.. అలాంటివాళ్లు స్వామివారిని క్షమాపణ వేడుకోవాల్సి ఉంటుంది. కలుషిత మనుష్కులైన భక్తులు వాళ్ల ఆత్మ సంతృప్తి కోసం పంచగవ్య మరియు శ్లోకాన్ని అయ్యప్ప స్వామివారి పేరుతో 101 సార్లు పఠించాల్సి ఉంటుంది.

గురుదక్షిణ
అయ్యప్ప దీక్షతో 5 పర్యాయాల కంటే ఎక్కువసార్లు ఎవరైతే స్వామివారిని దర్శించుకుని ఉంటారో అలాంటివారిని గురుస్వాములు లేదా గుంపు నాయకుడిగా పిలుస్తారు. అలాగే 18సార్లు శబరిమల యాత్ర చేసిన స్వాములను పెద్ద గురుస్వాములుగా పిలుస్తుంటారు. గురువుగారు సూచించిన శుభసమయంలో దగ్గరలోని అయ్యప్ప దేవాలయంలో గురువు గారి చేతుల మీదుగా అయ్యప్ప దీక్ష తీసుకోవాలి. గురువు చెప్పే ప్రతీ విషయాన్ని శ్రద్దగా విని తూ.చ. తప్పక పాటించటమే కాక గురువుపై అచంచల విశ్వాసం కలిగివుండాలి. గురువు ఆధ్వర్యంలోనే పవిత్రమైన ఇరుముడిని తయారుచేస్తారు. ఇరుముడి కట్టిన తరువాత గురువుకు గురుదక్షిణ సమర్పించుకుంటారు.

ఎనిమిది సందర్భాల్లో గురువు అర్పణలు ఇవ్వవచ్చు
అవి ఏంటంటే... తులసి లేదా రుద్రాక్ష మాల ధరించినప్పుడు, పవిత్రమైన ఇరుముడిని గురుస్వామి నుంచి స్వీకరించేందుకు ముందుగానో, ఎరుమేలిలో పేట్ట థుల్లాల్ నాట్యం చేసేందుకు ముందు, దేవుడి దర్శనానికి అటమీ మార్గం గుండా ప్రయాణం సాగించేందుకు మందుగా, శుద్ధి కోసం అళుదా నదిలో సేకరించిన రాయిని గురువు ఎప్పుడైతే తీసుకుంటారో ఆ సమయంలో, ఇరుముడిని కట్టి స్వామి మాల వేసుకున్న భక్తుల తలలపై పెట్టిన తరువాత పంపలో స్నానాలు చేస్తూ పితరులకు త్యాగ సమర్పణల తర్వాత, పవిత్రమైన ఇరుముడిని తయారు చేస్తున్నప్పుడు, పుణ్యక్షేత్ర సందర్శనం తరువాత, పర్యటన అనంతరం ఇంటికి చేరుకున్నాక తులసీమాల తీసివేస్తున్నప్పుడు.సమర్పణలునెయ్యితో నింపిన కొబ్బరికాయను ఇరుముడిలో దీక్షలో ఉన్న స్వాములు తీసుకెళ్తారు. ఈ నెయ్యిని స్వామివారి నేతి అభిషేకానికి ఉపయోగిస్తారు. పవిత్రమైన విభూది, పాలు, తేనె, పంచామృతం, లేత కొబ్బరినీరు, చందనం ముద్ద, గులాబీ నీరు మరియు నీరు లాంటి ద్రవాలు దేవుడి అష్టాభిషేకానికి అవసరమవుతాయి.చందనం మరియు గులాబీ నీటిని కలభాభిషేకంలో ఉపయోగిస్తారు.
తామర, మల్లె, తులసి, చేమంతి, గన్నేరు (అరళి) మరియు మారేడు (కూవలమ్) లాంటివి పుష్పాభిషేకంలో ఉపయోగిస్తారు.

వెడి వళిపాడు
పెద్ద పైకప్పుతో కూడిన కాలిబాట ప్రారంభమయ్యే చోట కుడివైపున వెడి వళిపాడు కౌంటర్ ఉంటుంది. మాలికాపురం ఆలయానికి దగ్గర్లో కూడా కౌంటర్లు ఉంటాయి. అలాగే టెంపుల్ టవర్‌కి దగ్గరగానూ, శబరి పీఠం మరియు కరిమల ప్లాట్‌ఫారంలకి దగ్గర్లోనూ కూడా కౌంటర్లు ఉన్నాయి.

ఉచిత భోజనం (అన్నదానం)
అయ్యప్ప స్వామి దేవాలయం చుట్టుపక్కల ఐదు ప్రాంతాలలో ఉచిత భోజన సౌకర్యాలు లేదా అన్నదానం సౌకర్యం లభిస్తోంది. మాలికాపురం ఆలయానికి దగ్గర్లో దేవేశ్వరన్ అన్నదానం కౌంటర్లో ప్రతిరోజూ సుమారు ఐదువేల మందికి ఉచిత భోజన సౌకర్యాలు సమకూరుతున్నాయి. అన్నం, సాంబార్, అవియల్ లాంటివి భోజనంలో లభిస్తున్నాయి.అలాగే అయ్యప్ప సేవా సంఘం రోజుకి మూడుసార్లు అన్నదానం చేస్తోంది. ఉదయాన్నే ఫలహారంగా ఉప్మా, మధ్యాహ్న భోజనంలో అన్నం పర్రిడ్జ్ (కంజి) లాంటివి భక్తులకు అందజేస్తున్నారు.

శ్రీ బోధనాథ ట్రస్ట్ అనుషద కంజిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకూ భక్తులకు ఉచితంగా అందజేస్తోంది. పరోపకార మరియు అక్షయ ట్రస్టులు కూడా భక్తులకు అన్నదానం చేసేందుకు అనుమతి కలిగి ఉన్నాయి.
పంప దేవస్థానంవారు, అయ్యప్ప సేవా సంఘం మరియు పంప విఘ్నేశ్వర సాధ్యాలయ సమితి "పంప"లో భక్తులకు ఉచిన భోజన సౌకర్యాలను సమకూర్చుతున్నాయి.

పవిత్రమైన రుద్రాక్ష లేదా తులసీమాలను తీసివేయటం
శబరిమల యాత్రను పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నేకే భక్తులు మెడలో ధరించిన పవిత్ర మాలను తీసివేయాల్సి ఉంటుంది. దీక్ష చేపట్టి స్వామివారి దర్శనం చేసుకుని శబరిమల యాత్ర ముగించుకుని భక్తులు ఇంటికి చేరుకునేంతవరకూ ఇంట్లో దీపం వెలుగుతూనే ఉండాలి. ఇంట్లోకి ప్రవేశించే ముందు అయ్యప్ప స్వామి పేరును మనసులో స్మరించుకుంటూ లోపలికి అడుగుపెట్టాలి. ఇరుముడిని దేవుని గదిలోనైనా ఉంచవచ్చు. లేకపోతే ఎక్కడైతే ఇరుముడిని కట్టారో ఆ ప్రదేశంలో ఇరుముడిని గురుస్వామికి సమర్పించాలి.
"అపూర్వ మాచల రోహ
దివ్య దర్శన కారణ
సహస్ర ముద్రత్వక దేవ
దేహిమే వ్రత మోచనం" పద్యాన్ని పఠిస్తూ పవిత్రమైన తులసి లేదా రుద్రాక్ష మాలను భక్తులు తీసివేయాల్సి ఉంటుంది. ఇలా తీసిన మాలలను అయ్యప్ప స్వామి చిత్ర పటం ముందుగానీ లేదా విగ్రహం ముందుగానీ ఉంచాలి.

పవిత్రమైన ఇరుముడి తయారీ
ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ, రెండు కొబ్బరి కాయలు, వక్కలు, తమలపాకులు, నాణాలు, పసుపు, గంధంపొడి, విభూతి, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం/అరటిపళ్ళు, కలకండ, అగరువత్తులు, కర్పూరం, మిరియాలు (వావర్‌ దర్గాకోసం), తేనె, ఎండు ద్రాక్ష, తువ్వాలు పెట్టుకుంటారు. ఈ వస్తువులను 'ఇరుముడి'గా కట్టుకునే ఉత్సవాన్ని'కెట్టునిరా' లేదా 'పల్లికెట్టు' అంటారు.

స్వామి అయ్యప్ప ఆలయం మరియు మాలికాపురం ఆలయాల వద్ద కంపార్ట్‌మెంట్ ముందు భాగంలో అయ్యప్ప స్వామివారికి భక్తుల ఇరుముడులను సమర్పిస్తుంటారు. కంపార్ట్‌మెంట్ వెనుక భాగంలో భక్తుల కోసం తినుబండారాలు లభిస్తాయి. కంపార్ట్‌మెంట్ ముందు భాగం ఆధ్యాత్మికతను సూచిస్తుంటే, వెనుక భాగం మెటీరియల్ జీవితానికి అద్దంపట్లేలా ఉంటుంది.
ఇలా సిద్ధం చేసిన ఇరుముడిని దీపం వెలిగించి గురుస్వామి ఆమోద ముద్ర వేస్తారు. కొబ్బరికాయ పీచు మొత్తాన్ని తీసివేసి దాని ముఖ భాగంలో రంధ్రాన్ని చేసి దానిని నేతితో నింపి బెరడుతో మూసివేయాలి. ఈ సమయంలో భక్తులందరూ అయ్యప్ప స్వామివారు పేరును స్మరిస్తూ ఉండాలి.

వక్కలు, చిల్లర నాణేలను తమలపాకులలో ఉంచి దారంతో గట్టిగా కట్టి ఉంచాలి. ముందుగా నేతితో నింపిన కొబ్బరికాయను ఇరుముడిలో ఉంచాలి. తమలపాకులు, వక్కలతో కూడిన ప్యాకును కూడా టోకోచుకదుత స్వామి నైవేద్యానికిగాను ఉంచాలి. ఈయన స్వామి అయ్యప్పకి శిష్యుడు మరియు సేనాపతి. అయ్యప్ప స్వామివారిని స్మరించుకుంటూ స్వామి పేరుతో తయారైన ఇరుముడిలో మూడు దోసిళ్లతో బియ్యాన్ని పోయాలి. రెండు భాగాలుగా కలిగిన ఇరుముడి విడి విడిగా కట్టబడి ఉంటుంది. ఇలా కట్టడంవలన ఇరుముడి స్వామి సన్నిధానం చేరేదాకా చెక్కు చెదరకుండా ఉంటుంది.

తరువాత, పెద్దలందరూ (తమలపాకు, వక్క, చిల్లర నాణేలతో కూడిన) గురు దక్షిణ సమర్పించుకుంటారు. నలుపు వస్త్రాన్ని నడుం చుట్టూ బిగించి భక్తుడు లేదా భక్తురాలి తలపై దుప్పటిని ఉంచుతారు. దానిపై తెల్లని టవల్‌తో కట్టిన సామగ్రిని ఉంచుతారు. రెండు అరలున్న మూటనే ఇరుముడి. దీనిని భక్తులు నెత్తిన పెట్టుకుని మోసుకుపోతుంటారు.
చివరగా, గురు దక్షిణ సమర్పించిన తరువాత శబరిమల యాత్ర ప్రారంభం అవుతుంది.